News June 6, 2024
నాలుగైదు రోజులపాటు ఆ షాక్ నుంచి తేరుకోలేదు: రోహిత్

వన్డే WC ఫైనల్లో ఓటమి తర్వాత నాలుగైదు రోజుల పాటు షాక్ నుంచి తేరుకోలేకపోయానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఫైనల్ జరిగిన తర్వాత రోజు నిద్ర లేచా. ఆ రాత్రి మనం ఓడిపోయినట్లు కల వచ్చింది. మరుసటి రోజు ఫైనల్ అనుకొని నిజంగా ఇలాగే జరుగుతుందా అని నా భార్య రితికాను అడిగా. కాసేపటికే తేరుకొని మనం ఓడిపోయామని గ్రహించా’ అని వెల్లడించారు.
Similar News
News September 15, 2025
తిరుపతిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తా: SP

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంచడమే పోలీసుల ధ్యేయమని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి’ తన లక్ష్యం అన్నారు.
News September 15, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
సుప్రీంకోర్టులో కోర్టు మాస్టర్ ఉద్యోగాలు

<