News May 4, 2024
ఆ కారణంతోనే ఓటు వేయలేదు: జ్యోతిక

ఈ సారి ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై నటి జ్యోతిక వివరణ ఇచ్చారు. ‘గత కొన్నేళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. కొన్ని సార్లు అత్యవసరమైతే చెన్నైలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈ సారి నేను అనారోగ్యంతో ఉన్నారు. అది నా వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు’ అని చెప్పారు. జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.
Similar News
News January 10, 2026
HYD: మాదాపూర్‌లో విషాదం.. యువకుడి ఆత్మహత్య

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
News January 10, 2026
జమ్మూ: సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్

జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించడం కలకలం రేపింది. BSF బలగాలు డ్రోన్ కదలికలను గుర్తించాయి. డ్రోన్ ద్వారా పాక్ ఆయుధాలు జార విడిచినట్లు తెలుస్తోంది. ఫ్లోరా గ్రామం వద్ద భద్రతా బలగాలు ఆయుధాలను గుర్తించాయి. 2 పిస్టల్స్, గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నాయి.
News January 10, 2026
బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

హైబీపీకి ఎన్నో కారణాలుంటాయి. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పొట్టుతో ఉన్న గింజధాన్యాలతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, అల్లం, వెల్లుల్లి వంటివి తీసుకోవాలి. రైస్‌బ్రాన్, నువ్వులు, ఆవ నూనెల్ని నాలుగైదు చెంచాలకు మించి వాడకూడదు. సలాడ్స్, నాటుకోడి, చేప తినొచ్చు. వీటితో పాటు ఒత్తిడినీ నియంత్రించుకోగలిగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.


