News March 29, 2024

డీజిల్ ఎగుమతి ఆదాయం ఢమాల్!

image

ఈ ఆర్థిక ఏడాది డీజిల్ ఎగుమతులతో భారత్‌కు వచ్చే ఆదాయం అంతకుముందుతో పోలిస్తే 25శాతం క్షీణించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో 11 నెలల్లో (APR-FEB) వచ్చిన మొత్తం $20 బిలియన్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో అంతకుముందుతో పోలిస్తే డీజిల్ ఎగుమతి 25.8 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 26mmtకి పెరిగినా ఫలితం లేకపోయింది. మరోవైపు పెట్రోల్ ఎగుమతుల ఆదాయం సైతం 13% క్షీణించి $10 బిలియన్లుగా నమోదైంది.

Similar News

News October 5, 2024

T20 వరల్డ్ కప్‌లో నేటి మ్యాచులు

image

యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో భాగంగా మ.3.30కి ఆస్ట్రేలియాతో శ్రీలంక, గ్రూప్-Bలో భాగంగా రా.7.30కి ఇంగ్లండ్‌తో బంగ్లాదేశ్ తలపడతాయి. నిన్న జరిగిన మ్యాచుల్లో ఇండియాపై న్యూజిలాండ్, వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.

News October 5, 2024

పెరగనున్న పత్తి ధరలు?

image

TG: రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం మార్కెట్‌లో నిన్న కొత్త పత్తి క్వింటాల్‌కు గరిష్ఠంగా ₹7,111, మోడల్ ధర ₹6,500, కనిష్ఠంగా ₹4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా ₹7550, కనిష్ఠ ధర ₹4,500గా ఉంది. వరంగల్ మార్కెట్‌లో గరిష్ఠంగా ₹7,600, మోడల్ ₹6,600, కనిష్ఠ ధర ₹5,500 వరకు పలికిందని, కొత్త పత్తి ₹7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.

News October 5, 2024

సోడాలు, కాఫీలు ఎక్కువ తాగుతున్నారా..?

image

సోడాలు, కాఫీలు ఎక్కువగా తాగేవారికి పక్షవాతం ముప్పు ఉందంటూ గాల్వే వర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. వాటి వలన డయాబెటిస్, బీపీ పెరుగుతాయని వివరించారు. ఇక కంపెనీలు తయారు చేసే జ్యూస్‌లలో కృత్రిమ షుగర్లు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, పెరాలసిస్ స్ట్రోక్ ముప్పును పెంచుతాయని హెచ్చరించారు. వాటి బదులు సహజమైన పళ్లరసాలు శ్రేయస్కరమని సూచించారు. ఏం తిన్నా, ఏం తినకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి.