News December 26, 2024

కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?

image

TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.

Similar News

News December 30, 2025

నాన్న లేని లోకంలో ఉండలేక.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన

image

TG: తల్లి చిన్నప్పుడే దూరమవడంతో తండ్రే లోకంగా పెరిగాడు నితిన్‌. తండ్రి నాగారావు అమ్మలా గోరుముద్దలు తినిపించాడు. ఫ్రెండ్స్‌లా ప్రతి విషయం షేర్ చేసుకునేవారు. అలాంటి తండ్రి 3 రోజుల క్రితం మృతిచెందడంతో తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియల తర్వాత ఇంటి నిండా నిశ్శబ్దం అతడిని మరింత కుంగదీసింది. నాన్న లేని లోకంలో ఉండలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్‌ జిల్లా బాసరలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

News December 30, 2025

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు షాక్

image

చండీగఢ్ కన్జూమర్ కోర్టు Star హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మహిళ సర్జరీకి ₹2.25 లక్షలు ఖర్చవగా Star ₹69K ఇచ్చి మిగతాది మినహాయింపు అని చెప్పింది. దీనిపై కోర్టుకెళ్తే రూల్స్ ఒప్పుకునే పాలసీ తీసుకున్నారని Star వాదించింది. దీంతో కండిషన్స్ కాపీపై వారి సంతకాలేవి? షరతులు క్లెయిమ్ టైంలోనే చెబుతారా? అని కోర్టు మండిపడింది. మొత్తాన్ని 9%వడ్డీతో, మానసిక వేదనకు మరో ₹20K ఇవ్వాలని ఆదేశించింది.

News December 30, 2025

NIT వరంగల్‌లో 45 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>NIT<<>> వరంగల్‌లో 45 ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD, ME, MTech, MSc(కెమిస్ట్రీ), MBA, MCA, MA, MCom ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, టీచింగ్/రీసెర్చ్ సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2000, SC, ST, PwDలకు రూ.1000. వెబ్‌సైట్: https://nitw.ac.in/faculty