News November 30, 2024
EVM ఓట్లలో తేడా ఉంది కానీ ఆధారాల్లేవు: శరద్ పవార్

EVMల పనితీరుపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సందేహాలు వ్యక్తం చేశారు. వాటిలో నమోదు చేసిన ఓట్లలో తేడాలున్నాయని ఆరోపించారు. ‘ఓట్లలో కచ్చితంగా ఏదో తేడా కనిపిస్తోంది. కానీ దానికి సంబంధించిన ఆధారాలేవీ ప్రస్తుతానికి నావద్ద లేవు. కొంతమంది రీకౌంటింగ్కి డిమాండ్ చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. కేంద్రంలోని NDA సర్కారు కారణంగా మహారాష్ట్ర ప్రజల్లో ఎన్నికలు ఆందోళన కలిగించాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News October 31, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18156666>>మరోసారి<<>> పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ మొత్తంగా రూ.1,800 పెరిగి ₹1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650కు ఎగబాకి రూ.1,13,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 31, 2025
BREAKING: భారత్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.
News October 31, 2025
3 రాష్ట్రాల్లో పోటీ.. ఓ గెలుపు.. తొలిసారి మంత్రి

TG: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, <<18158294>>మంత్రి అజహరుద్దీన్<<>> పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో INCలో చేరిన ఆయన మొరదాబాద్(UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్(రాజస్థాన్) లోక్సభ స్థానంలో ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంతరాష్ట్రం తెలంగాణలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


