News September 2, 2025
అవినీతి సొమ్ము పంచుకోవడంలో విభేదాలు: రాంచందర్ రావు

TG: ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో స్పష్టమైందని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని డైవర్షన్ చేసేందుకు కవితను సస్పెండ్ చేశారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అధికారంకోసం పంచాయితీ జరుగుతోందన్నారు. BRS, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
Similar News
News September 2, 2025
రాజకీయ పార్టీ నడిపిన తెలుగు వనితలు వీరే

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రేణుకా చౌదరి-టీడీపీ-2(1994), లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్ టీడీపీ(1996), విజయశాంతి-తల్లి తెలంగాణ(2005), కొత్తపల్లి గీత-జన జాగృతి(2018), వైఎస్ షర్మిల-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(2021) స్థాపించారు. కానీ టీడీపీ-2, ఎన్టీఆర్ టీడీపీ తర్వాతి కాలంలో రద్దు కాగా, మిగతా పార్టీలు ఇతర పార్టీల్లో విలీనమయ్యాయి.
News September 2, 2025
ఇంగ్లండ్ బౌలర్ బేకర్ చెత్త రికార్డు

ఇంగ్లండ్ బౌలర్ సోనీ బేకర్ అరంగేట్ర మ్యాచులోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో బేకర్ 7 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 76 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో డెబ్యూట్ మ్యాచులో అత్యధిక పరుగులు ఇచ్చిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా ఆయన నిలిచారు. అటు బ్యాటింగ్‌లోనూ బేకర్ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ను సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
News September 2, 2025
ఈ నెల 5న అరకులో పర్యటించనున్న పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 5న అరకులోని మాడగడ గిరిజన గ్రామంలో పర్యటిస్తారని జనసేన ప్రకటనలో తెలిపింది. ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’లో పాల్గొంటారని పేర్కొంది. 12 రోజుల పాటు గ్రామంలో నిర్వహించే ఈ వేడుకలు గత నెల 25న ప్రారంభమయ్యాయి. గిరి పుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజున పవన్ హాజరవుతారని వెల్లడించింది. ఆంధ్ర సరిహద్దుల్లోని ఈ గ్రామంలో జరిగే ఉత్సవాల్లో ఒడిశా ఆదివాసీలూ పాల్గొంటారు.