News March 18, 2024
విశాఖ జనసేనలో విభేదాలు

AP: విశాఖ జిల్లా జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. విశాఖ సౌత్ సీటు స్థానికులకే కేటాయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ జెండా మోయని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వంశీకి సీటు ఇస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ కేటాయింపుపై జనసేనాని ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తిగా మారింది.
Similar News
News November 2, 2025
కల్తీ కుంకుమని ఇలా గుర్తించండి

కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు..* నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా ఉంటే కృత్రిమ రంగులు వాడారని అర్థం. * సహజంగా చేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే కల్తీ చేశారని అర్థం. * గ్లాసీ లుక్ ఉండే కుంకుమల్లో హానికారక డైలు కలిపినట్లే. * నకిలీ కుంకుమైతే నీళ్లలో కలిపితే కరిగిపోకుండా నీటి రంగు మారుతుంది.
News November 2, 2025
NHIDCLలో 34 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(<
News November 2, 2025
దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

TG: వికారాబాద్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తె, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కూతురుపైనా దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


