News November 8, 2024
వైసీపీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు

AP అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమన్న YCP నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 11 సీట్లే గెలవడాన్ని అవమానంగా భావించి దూరంగా ఉండడం సరికాదని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. ప్రజలు ఏ పదవిలో కూర్చోబెట్టినా దానికి న్యాయం చేయాలంటున్నారు. అయితే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో ఇక సభలో ఎదురయ్యే అవమానాల దృష్ట్యా ఆత్మగౌరవం దెబ్బతినొద్దనే ఇలా చేస్తున్నట్లు YCP శ్రేణులు చెబుతున్నాయి. మీరేమంటారు?
Similar News
News November 21, 2025
మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం

శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 21, 2025
మరో తుఫాను ‘సెన్‌యార్’!

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ‘సెన్‌యార్’ పేరును IMD పెట్టనున్నట్లు సమాచారం. సెన్‌యార్ అంటే ‘లయన్’ అని అర్థం. తుఫాను ప్రభావంతో 24వ తేదీ నుంచి తమిళనాడులో, 26-29వరకు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇటీవల ‘మొంథా’ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
News November 21, 2025
కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్ 2 పరీక్ష ఎప్పుడంటే?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 552 కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు సంబంధించి పేపర్ 2 పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 14న డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 12న నిర్వహించిన పేపర్ 1 పరీక్షను 6,332 మంది రాయగా.. పేపర్ 2కు 3,642మంది అర్హత సాధించారు.


