News October 17, 2024

గ్రూప్-1 మెయిన్స్ వాయిదా డిమాండ్‌పై భిన్న వాదనలు!

image

TG: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలన్న కొందరు అభ్యర్థుల డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రిలిమ్స్ రాశామని, మళ్లీ వాయిదా వేయడం ఎందుకని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం, డబ్బులు వృథా అవుతున్నాయని వాపోతున్నారు. రిజర్వేషన్లపై కోర్టులో కేసులు ఉన్నాయని, ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ మొదటికి వస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 18, 2026

‘గ్రీన్‌లాండ్‌ డీల్’ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే తన లక్ష్యాన్ని వ్యతిరేకించిన దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్‌, ఇతర యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. గ్రీన్‌లాండ్ డీల్ పూర్తి కాకపోతే జూన్ 1 నుంచి టారిఫ్స్‌ను 25 శాతానికి పెంచుతానని హెచ్చరించారు.

News January 18, 2026

మెరిసిన మంధాన.. RCB ఘన విజయం

image

WPL: ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో RCB 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన(96), జార్జియా హాఫ్ సెంచరీ(54*)తో రాణించడంతో 167రన్స్ లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. DC బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. మారిజాన్‌, నందినీ శర్మలకు చెరో వికెట్ దక్కింది. ఢిల్లీ తరఫున షెఫాలీ వర్మ(62) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.

News January 18, 2026

రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

image

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.