News September 23, 2025

రాష్ట్రంలో భిన్న వాతావరణం

image

TG: గత 4-5 రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. పొద్దంతా ఎండ, ఉక్కపోతగా ఉంటూ సాయంత్రం వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు వర్షం కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న యాదాద్రిలోని పాముకుంటలో 11.3cm, HYDలోని షేక్‌పేటలో 10.1cm, శ్రీనగర్ కాలనీలో 9.55cmల వర్షపాతం నమోదైంది. రాబోయే 2రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది.

Similar News

News September 23, 2025

వేణుగోపాల్‌పై మావోయిస్టు పార్టీ చర్యలు

image

<<15966343>>‘అభయ్’<<>> పేరుతో కేంద్రంతో శాంతి చర్చలకు పిలుపునిచ్చిన మల్లోజుల వేణుగోపాల్‌ను మావోయిస్టు కేంద్ర కమిటీ ‘ద్రోహి’గా పేర్కొంది. తన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేదంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ తమ్ముడే వేణుగోపాల్. కిషన్‌జీ భార్య సుజాతక్క ఇటీవల పోలీసులకు <<17695477>>లొంగిపోయిన<<>> విషయం తెలిసిందే.

News September 23, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,260 పెరిగి రూ.1,14,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.1,150 ఎగబాకి రూ.1,04,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,49,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 23, 2025

గాయత్రీ దేవిగా కనకదుర్గమ్మ.. ఈ మంత్రం పఠించండి

image

శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. ఇవాళ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి. ‘ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః.. యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్| గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీభజే॥’ గాయత్రీ అమ్మవారిని దర్శిస్తే ఆరోగ్యం లభిస్తుంది.