News May 5, 2024

ఒకే వీధిలో వేర్వేరు రాష్ట్రాలు!

image

ఒకే వీధిలో ఉన్న ఆ తండ్రీకొడుకులు వేర్వేరు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకున్నారు. విభజన తర్వాత ఆయన ఇల్లు తెలంగాణ మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వెళ్లింది. అదే వీధిలో రోడ్డుకు అటువైపున ఆయన కుమారుడు ఇల్లు కట్టుకుంటుండగా అది ఏపీలోని అరకు లోక్‌సభ స్థానంలో ఉండటం విశేషం.

Similar News

News October 25, 2025

ఇంటి చిట్కాలు

image

* 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో 1 వంతు గోరువెచ్చని నీళ్లు పోసి క్లీనర్ రెడీ చేసుకోవాలి. దీంతో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఫ్యాన్లు, ఏసీలపై మరకలు సులువుగా పోతాయి
* క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌ను స్టీలు స్క్రబ్బర్‌తో గట్టిగా తోమితే కుక్‌వేర్ పొర పోవచ్చు. వీటిని స్పాంజ్ స్క్రబ్బర్‌తో మైల్డ్ డిష్ సోప్ ఉపయోగించి తోమాలి.
* షవర్ జామ్ అయితే కాస్త వెనిగర్, నీళ్లు కలిపి దానికి పట్టేలా రాసి, గంట తర్వాత కడిగేయాలి.

News October 25, 2025

అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీ ప్రజలు!

image

దేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక వెల్లడించింది. AP తొలి స్థానంలో, తెలంగాణ రెండో ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. 2020-21 లెక్కల ప్రకారం ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో చిక్కుకున్నారు. కేరళ(29.9), తమిళనాడు(29.4), కర్ణాటక (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా 3.2%, ఛత్తీస్‌గఢ్‌లో 6.5% మంది ఉండటం గమనార్హం.

News October 25, 2025

కీళ్ల నొప్పులు మహిళలకే ఎందుకు ఎక్కువ?

image

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కీళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి జన్యుపరంగానే కాకుండా జీవనశైలి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘రుతుస్రావం, గర్భం, మెనోపాజ్ సమయాల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పులు ఆర్థరైటిస్ లక్షణాలను ప్రభావితం చేస్తాయి. అలాగే బరువు పెరగడం, ఇంటి పనులు, శారీరక, మానసిక సమస్యలు కూడా కీళ్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొంటున్నారు.