News June 16, 2024
లోక్‌సభ స్పీకర్ అభ్యర్థి ఎంపికపై NDAలో భిన్న స్వరాలు?

లోక్‌సభ స్పీకర్ పదవి NDAలో భాగమైన ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో JDU, TDP నేతల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. స్పీకర్ అభ్యర్థిగా BJP ఎవరిని నామినేట్ చేస్తే వారికే మద్దతు ఇస్తామని JDU నేత కేసీ త్యాగి వ్యాఖ్యానించగా, మిత్రపక్షాలన్నీ సమావేశమై అభ్యర్థిని నిర్ణయిస్తాయని TDP నేత పట్టాభిరామ్ తెలిపారు. మరోవైపు JDU/TDPకి ఈ పదవిని ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు అంటున్నారు.
Similar News
News November 26, 2025
పెబ్బేరు: రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడి మృతి

పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్, అతని అల్లుడు ప్రవీణ్ బైక్‌పై రంగాపురం నుంచి పెబ్బేరుకు వస్తుండగా బైపాస్ వద్ద హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు రమేష్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
News November 26, 2025
‘సీఎం’ వివాదాన్ని మేమే పరిష్కరిస్తాం: ఖర్గే

కర్ణాటకలో CM పదవి వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సోనియా గాంధీ, రాహుల్, తాను కలిసి పరిష్కరిస్తామని వెల్లడించారు. కర్ణాటకలో క్షేత్రస్థాయిలో ఉన్న వారు మాత్రమే పరిస్థితిని అంచనా వేయగలరని చెప్పారు. కాగా ఈ విషయంపై రానున్న 48 గంటల్లో రాహుల్‌తో ఖర్గే భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత సిద్దరామయ్య, DK శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
News November 26, 2025
400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RITES 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి DEC 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PwBD, EWS వారికి రూ.300. వెబ్‌సైట్: https://rites.com *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


