News March 18, 2024

నగరిలో రోజాకు గడ్డు పరిస్థితులు?

image

AP: వచ్చే ఎన్నికల్లో నగరిలో మంత్రి రోజా గడ్డు పరిస్థితులు ఎదుర్కోనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె దూకుడుతో సొంత పార్టీ నేతలే ఆమెకు దూరమవుతున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ ఆమెకు వ్యతిరేక గాలి వీస్తోందని విశ్లేషిస్తున్నారు. గతంలో రెండు సార్లు స్వల్ప ఆధిక్యంతో (2014లో 1,000, 2019లో2,000 ఓట్లు) గెలిచిన రోజా ఈ సారి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిందేనని చెబుతున్నారు.

Similar News

News December 23, 2024

ఆ స్క్రిప్ట్ పట్టుకొని 14 ఏళ్లు తిరిగిన శ్యామ్ బెనగల్

image

1974లో విడుద‌లై జనాదరణ పొందిన అంకుర్ చిత్రాన్ని తీయడానికి శ్యామ్ బెన‌గ‌ల్‌ 14 ఏళ్ల‌పాటు నిర్మాత‌ల చుట్టూ తిరిగారు. సాంఘిక వివక్ష, పేదరికం, మహిళల హక్కుల నేప‌థ్యం క‌లిగిన ఈ చిత్రాన్ని చివ‌రికి బ్లేజ్ ఫిలిం నిర్మించింది. తొలుత తెలుగులో తీయాల‌నుకున్నా నిర్మాతలు హిందీలో తీయ‌డానికి శ్యామ్ బెన‌గల్‌ను ఒప్పించారు. ₹5 ల‌క్ష‌ల‌తో సినిమా తీస్తే ₹కోటి వ‌ర‌కు వ‌సూళ్లు సాధించి అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది.

News December 23, 2024

హైకోర్టులో KCR, హరీశ్ క్వాష్ పిటిషన్

image

TG: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. మేడిగడ్డ నిర్మాణంలో వీరిద్దరూ అవినీతికి పాల్పడ్డారంటూ భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను కొట్టేయాలంటూ KCR, హరీశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

News December 23, 2024

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి

image

ప్ర‌ముఖ సినీ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత శ్యామ్ బెన‌గ‌ల్‌(90) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్‌లో అంకుర్, భూమిక, నిషాంత్, కల్‌యుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. 1934లో డిసెంబర్ 14న HYD తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి.