News July 6, 2024
భారత్లో తగిన ఉద్యోగాలు కల్పించడం కష్టం: సిటీ బ్యాంక్ రిపోర్ట్

దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 7% వృద్ధితో పరుగులు పెట్టినా నిరుద్యోగాన్ని అధిగమించడం కష్టమేనని సిటీ బ్యాంక్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. నిరుద్యోగ భారం తగ్గాలంటే ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నారు. కానీ ప్రస్తుత వృద్ధి ప్రకారం ఏటా 80లక్షల నుంచి 90లక్షల ఉద్యోగాలు మాత్రమే భారత్ సృష్టించగలదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తయారీ రంగంలో ఎగుమతుల వృద్ధిపై ఫోకస్ మొదలైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News December 29, 2025
టమాటా కాయలపై చిన్న చిన్న రంధ్రాలకు కారణమేంటి?

కొన్ని టమాటా కాయలను పరిశీలిస్తే వాటిపై చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. దీనికి కారణం సూది పురుగు. ఇది చిన్న గొంగళి పురుగు రూపంలో ఉండి, ఆకులలో సొరంగాలను చేసి, పండ్లలో చిన్న రంధ్రాలు చేసి లోపల తింటుంది. ఈ పురుగుల వల్ల పండ్లు రంగు మారి, పాడైపోతాయి. సూది పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ml లేదా ప్లూబెండమైడ్ 0.2ml కలిపి పిచికారీ చేయాలి.
News December 29, 2025
AI కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు సేవలు: TTD AEO

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని TTD AEO వెంకయ్య చౌదరి తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని వెల్లడించారు. ప్రతిచోటా టెక్నాలజీని వాడుకుంటున్నామని, AI కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తుల దర్శనం, వెయిటింగ్, వాహనాల పార్కింగ్ సహా అన్నింటినీ మానిటర్ చేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లడ్డూల కౌంటర్లు కూడా పెంచామన్నారు.
News December 29, 2025
‘లేడీ సింగం’.. కిడ్నాపర్ల పాలిట సింహ స్వప్నం!

ఢిల్లీ పోలీస్ అధికారిణి సీమా కేవలం 3 నెలల్లో 76 మంది అదృశ్యమైన చిన్నారులను రక్షించి శభాష్ అనిపించారు. ప్రమాదకర నిందితులను ఎదుర్కొంటూ ఆమె చేసిన ఈ ఆపరేషన్లో ఎక్కువ మంది కార్మికుల పిల్లలే ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టుదలతో ఆమె చేసిన ఈ కృషిని గుర్తించిన ప్రభుత్వం.. సీమాకు కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐగా పదోన్నతి కల్పించింది. విధి నిర్వహణలో ఆమె చూపిన అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలిచింది.


