News November 9, 2024
APAAR నమోదులో ఇబ్బందులు.. స్కూళ్లకు కీలక ఆదేశాలు

AP: ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్ కార్డ్’లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన APAAR(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదులో ఇబ్బందులొస్తున్నాయి. ఆధార్, DOB, స్కూల్ రికార్డుల్లో విద్యార్థుల వివరాలు వేర్వేరుగా ఉండటంతో టీచర్లు తలపట్టుకుంటున్నారు. దీంతో పాఠశాల రికార్డుల్లోనే మార్పులు చేసే అధికారాన్ని HMలు, MEOలకు కల్పిస్తూ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఇందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది.
Similar News
News December 11, 2025
వరంగల్ జిల్లాలో 61% పోలింగ్ @11AM

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు గాను జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 61% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పర్వతగిరిలో 65.57, రాయపర్తిలో 59.78, వర్ధన్నపేటలో 57.45% నమోదయింది. కాగా, పోలింగ్‌కు ఇంకా రెండు గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
News December 11, 2025
థాయ్‌లాండ్‌లో పట్టుబడిన లూథ్రా బ్రదర్స్

గోవా నైట్‌క్లబ్ <<18509860>>ప్రమాదం<<>>లో కీలక నిందితులు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డారు. డిసెంబర్ 7న రాత్రి క్లబ్లో మంటలు చెలరేగి 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిద్దరూ పరారయ్యారు. నిబంధనల ఉల్లంఘనే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో లూథ్రా బ్రదర్స్‌నూ భారత్‌కు తీసుకురానున్నారు.
News December 11, 2025
సోనియాగాంధీతో CM రేవంత్ భేటీ

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించిన తీరును ఆమెకు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల వారి నుంచి సదస్సుకు వచ్చిన స్పందన, పెట్టుబడుల గురించి వివరించారు. ₹5.75 లక్షల కోట్ల ఇన్వెస్టుమెంట్లకు జరిగిన ఒప్పందాలను చెప్పారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు.


