News August 7, 2024
కష్టం వృథా.. మిగిలింది వ్యథ

ఏ రంగంలోనైనా పైకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్పోర్ట్స్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం చాలా హార్డ్‌వర్క్ చేయాలి. ఎన్నో ఏళ్లు కష్టపడ్డ తర్వాత చివరకు ఫలితం అనుకూలంగా రాకపోతే ఆ బాధ వర్ణనాతీతం. 2016 ఒలింపిక్స్‌లో గాయం వల్ల QFలోనే వైదొలిగిన వినేశ్ ఫొగట్, 2020లో QFలో ఓడారు. ఇప్పుడు ఫైనల్ చేరినా స్వల్ప అధిక బరువు వల్ల అనర్హత వేటు పడింది. గోల్డ్ మెడల్ తేవాల్సిన ఆమె బరువెక్కిన హృదయంతో INDకి రానున్నారు.
Similar News
News March 3, 2026
ఇంటర్ పూర్తవుతుందా.. NEXT ఏంటి?

ఇంటర్ తర్వాత విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. MPC వారికి ఇంజినీరింగ్, పైలట్, రక్షణ రంగాలు. BiPC వారికి మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉత్తమ మార్గాలు. MEC, CEC వారు CA, LAW, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో రాణించవచ్చు. డిజైనింగ్, యానిమేషన్ వంటి కోర్సులూ ఎంచుకోవచ్చు. డిగ్రీలోనూ చేరవచ్చు. IIT, NEET, CLAT వంటి ప్రవేశ పరీక్షలు రాసి ఉన్నత సంస్థల్లో చేరవచ్చు. SHARE IT
News March 3, 2026
BHELలో 47 పోస్టులు.. అప్లై చేశారా?

ఝాన్సీలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) 47అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE/BTech, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://jhs.bhel.com
News March 3, 2026
UAEలో ‘ప్యానిక్ బయ్యింగ్’.. ప్రభుత్వం భరోసా!

ఇరాన్ దాడుల నేపథ్యంలో UAEలో నీటి కొరత ఏర్పడొచ్చనే భయాందోళనలు మొదలయ్యాయి. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో జనం సూపర్ మార్కెట్లకు పోటెత్తడంతో నిత్యావసరాలు, బాటిల్ వాటర్ షెల్ఫ్స్ ఖాళీ అవుతున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా నిలిచిపోతుందనే అనుమానాలే ఈ ‘ప్యానిక్ బయ్యింగ్’కు దారితీశాయి. అయితే దేశంలో 3నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందొద్దని UAE ప్రభుత్వం భరోసా ఇచ్చింది.


