News August 8, 2025
నీట్, జేఈఈ విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్

నీట్, జేఈఈ-2026 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్‌ను సిద్ధం చేసినట్లు ఐఐటీ/జేఈఈ ఫోరం తెలిపింది. ఇందులో స్టడీ మెటీరియల్, గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్స్, ‘కోటా’ ప్రీవియస్ టెస్టులు, NCERT నీట్ క్వశ్చన్ బ్యాంక్‌ను వాట్సాప్ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. పూర్తి సమాచారానికి 9849016661 నంబర్ వాట్సాప్‌లో మెసేజ్ చేయాలని సూచించింది.
Similar News
News August 8, 2025
KGHలో లంచం లేనిదే పనవ్వదా?

KGHలో వైద్య సేవలపై ప్రజలకు రోజురోజుకీ నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ విమర్శలకు Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన ‘<<17338114>>చేతులే.. వీల్ ఛైర్<<>>’ అన్న వార్తకు వచ్చిన కామెంట్లే నిదర్శనం. ‘లంచం లేనిదే ఇక్కడ పనవ్వదని’, ‘రోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు’అని ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రుకు వెళ్లలేని నిరుపేదలు కొనఊపిరితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడికి వస్తారు. ఇప్పటికైనా సంబంధిత మంత్రి దృష్టి సారించాల్సి ఉంది.
News August 8, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతుండగా.. సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో 80,126 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 24,444 వద్ద ట్రేడవుతున్నాయి. టైటాన్, NTPC, బజాజ్ ఫైనాన్స్, ITC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
News August 8, 2025
బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్

శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాల వేళ బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. వరుసగా ఐదో రోజూ బంగారం ధరలు పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹760 పెరిగి ₹1,03,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹700 పెరిగి ₹94,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.