News December 12, 2024
మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి: చంద్రబాబు

AP: గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము లిక్కర్ విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌ను పూర్తిగా అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి అని అధికారులను సీఎం ఆదేశించారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలన్నారు.
Similar News
News December 5, 2025
NRPT: మూడోదశ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రారంభం

నారాయణపేట జిల్లాలోని మాగనూర్, కృష్ణ, ఉట్కూర్, మక్తల్, నర్వ మండలాల పరిధిలో సర్పంచ్, వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ ఐదు మండలాల్లో కలిపి 110 గ్రామపంచాయతీలు, 994 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో డిసెంబర్ 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల ఓటింగ్ వేయడానికి అవకాశం కల్పించి మధ్యాహ్నం 02 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభిస్తారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.


