News September 11, 2024
వరద బాధితులకు దిల్ రాజు, నాగవంశీ చెరో రూ.25 లక్షలు

వరద బాధితుల సహాయార్థం సినీ నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ చెరో రూ.25లక్షలు తెలంగాణ సీఎం రేవంత్‌కు అందించారు. ఇక నిర్మాణ సంస్థ మేఘా గ్రూప్ తెలంగాణకు, ఏపీకి చెరో రూ.5కోట్ల విరాళం ఇచ్చింది. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ, ఆయన తనయుడు మహేశ్ బాబు ఫ్యాన్స్ విజయవాడ వరద బాధితుల కోసం రూ. రెండున్నర లక్షలు ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు.
Similar News
News December 4, 2025
రుద్రంగి మండలంలో ఏకగ్రీవం అయిన పంచాయతీలివే

రుద్రంగి మండలంలో ఏడు పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి. చింతామణి తండా, రూప్లా నాయక్ తండా, వీరుని తండా, అడ్డబోర్ తండా, బడి తండా, గైదిగుట్ట తండా, సర్పంచ్ తండా ఏకగ్రీవం అయిన జాబితాలో ఉన్నాయి. వీటిలో మూడు పంచాయతీల్లో సింగిల్ నామినేషన్ రాగా, మిగతా నాలుగు పంచాయతీల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవమయ్యాయి. ఏడు పంచాయతీల్లో వార్డు సభ్యులు కూడా పూర్తిగా ఏకగ్రీవం కావడం విశేషం.
News December 4, 2025
SIDBIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News December 4, 2025
నేడు ఇలా చేస్తే.. సిరి సంపదలకు లోటుండదు: పండితులు

నేడు మార్గశిర పౌర్ణమి, గురువారం కలిసి వచ్చిన అత్యంత పవిత్రమైన రోజు. ఈ శుభ దినాన కొన్ని పూజలు, పనులు చేయడం వల్ల సిరిసంపదలకు లోటుండదని పండితులు అంటున్నారు. పేదలకు అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మానసిక ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయంటున్నారు. ‘సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా, విన్నా కూడా శుభం కలుగుతుంది. దీపారాధన చేయవచ్చు. ఇష్టదైవానికి శనగలు నైవేద్యంగా సమర్పించాలి’ అని సూచిస్తున్నారు.


