News January 2, 2025

దిల్ రాజు కరెక్ట్‌గానే చెప్పారు: సీపీఐ నారాయణ

image

సినీ రంగాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని నిర్మాత దిల్ రాజు చేసిన ప్రకటనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. ఆయన అభిప్రాయం సమంజసమేనని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వానికి, సినిమా రంగానికి విభేదాలు అవసరం లేదు. దిల్ రాజు ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా.. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దంటూ మాజీ మంత్రి KTRకు రాజు చేసిన సూచన రాజకీయ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 4, 2025

‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు భారీగా పెంపు

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’కు AP ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తొలిరోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. JAN 10న అర్ధరాత్రి ఒంటిగంట షో(బెన్ఫిట్)కు టికెట్‌ రూ.600కు అమ్ముకోవచ్చని తెలిపింది. మిగతా 5 షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.175, సింగిల్ స్క్రీన్‌లపై రూ.135 హైక్ ఇచ్చింది. 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలకు హైక్‌తో టికెట్స్ విక్రయించుకోవచ్చని చెప్పింది.

News January 4, 2025

AUSలో INDvsPAK టెస్టు నిర్వహించాలి: మాజీ క్రికెటర్

image

IND-PAK టెస్టు సిరీస్‌ నిర్వహించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కోరారు. BGT టెస్టుకు భారీగా ప్రేక్షకులు వస్తున్నారని, IND-PAK టెస్టుకు ఇంతకు మించి ప్రజాదరణ ఉంటుందన్నారు. ‘AUSలో INDvsPAK టెస్టు చూడటం చాలా ఇష్టం. WC, CTల్లో ఇవి కలిసి ఆడతాయి. కానీ, టెస్టు క్రికెట్‌లో వీరి మధ్య పోటీ బాగుంటుంది. UK లేదా AUSలో నిర్వహించాలి’ అని చెప్పారు. 2007లో జరిగిన టెస్టు సిరీస్‌లో IND 1-0తో గెలుపొందింది.

News January 4, 2025

విశాఖకు త్వరలో మెట్రో రైలు: సీఎం చంద్రబాబు

image

AP: నేవీ డే సందర్భంగా విశాఖ సాగర తీరంలో ప్రదర్శించిన విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రానికి విశాఖ ఆర్థిక రాజధాని అని, ఇక్కడ త్వరలోనే మెట్రో రైలు ప్రారంభిస్తామని వెల్లడించారు. గతంలో ఎన్నోసార్లు నగరానికి వచ్చినప్పటికీ ఈసారి సంతోషంగా ఉందని తెలిపారు. నావికాదళ క్రమశిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. హుద్ హుద్ తుఫాను సమయంలో నేవీ సహకారం మర్చిపోలేమని పేర్కొన్నారు.