News February 4, 2025
ఐటీ విచారణకు దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
Similar News
News November 3, 2025
నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ నేటి నుంచి బంద్ చేపడుతున్నట్లు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్య సంఘం(FATHI) తెలిపింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కాలేజీలను మూసివేస్తున్నామని వెల్లడించింది. బకాయిలు చెల్లించేవరకు తెరవబోమని హెచ్చరించింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 6న HYDలో లక్షన్నర మంది సిబ్బందితో సభ ఏర్పాటు చేస్తామని తెలిపింది.
News November 3, 2025
అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.
News November 3, 2025
ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని కర్నూలు, తిరుపతిలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. యాదాద్రిలోని చౌటుప్పల్‌లో 6.1cm, నిజామాబాద్‌లోని మంచిప్పలో 5.4cmల వర్షపాతం నమోదైంది.


