News April 15, 2025
రేపు దిల్ రాజు ‘భారీ’ అనౌన్స్‌మెంట్!

నిర్మాత దిల్ రాజు నుంచి రేపు ఉదయం 11.08 ఓ భారీ అనౌన్స్‌మెంట్ రానుంది. ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని ట్విటర్లో ప్రకటించింది. ‘బోల్డ్.. బిగ్.. బియాండ్ ఇమాజినేషన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సినిమాల్లో AI టెక్నాలజీ వాడేందుకు దిల్ రాజు ఓ సంస్థతో ఒప్పందం చేసుకోవడం లేదా సొంతంగా సంస్థ ప్రారంభించడం ఈ ప్రకటన వెనుక కారణం కావొచ్చని సినీవర్గాలంటున్నాయి.
Similar News
News February 14, 2026
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

తూర్పు గోదావరి జిల్లాలో 6 కోర్టు అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, 7వ తరగతి అర్హత కలిగి, వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. కోర్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.10వేలు, కోర్ట్ అటెండెంట్‌కు రూ.6వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in/
News February 14, 2026
ఆయిల్ పామ్ తోటల్లో ఈ అంతర పంటలతో మేలు

ఆయిల్ పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. పూత సమయంలో వీటిని దున్నితే సేంద్రియ పదార్థం పెరుగుతుంది. కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటివి అంతర పంటలుగా సాగు చేయడానికి అనువైనవి.
News February 14, 2026
శివరాత్రి రోజున ఏం చేయాలంటే?

శివరాత్రి రోజున భక్తుల కార్యాలు జన్మజన్మల పాపాలను హరిస్తాయని పండితులు చెబుతున్నారు. శివునికి ప్రీతిపాత్రమైన బిల్వదళాలు సమర్పించాలని సూచిస్తున్నారు. ‘పంచామృత అభిషేకం విశేష ఫలితాలను ఇస్తుంది. భజనలు చేస్తూ, రాత్రంతా జాగరణ ఉంటూ, ఈశ్వర నామస్మరణలో గడిపితే అజ్ఞానం నశిస్తుంది. మనసా వాచా కర్మణా శివుడి ఆరాధన ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పిస్తుంది. ఇలా కైలాసనాథుని అనుగ్రహం లభిస్తుంది’ అని చెబుతున్నారు.


