News March 21, 2025
‘కోర్టు’ నటుడితో దిల్ రాజు మూవీ?

‘కోర్టు: స్టేట్vsనోబడీ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు హర్ష్ రోషన్‌తో దిల్ రాజు సినిమా తీయనున్నట్లు సమాచారం. దీనికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రమేశ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తారని టాలీవుడ్ టాక్. ఇందులో శివాజీ కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన కోర్టు మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2025
ఇక రచ్చే.. రేపే IPL ప్రారంభం

ధనాధన్ క్రికెట్ సంబరానికి సర్వం సిద్ధమైంది. రేపు IPL 18వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో KKR, RCB పోటీ పడనున్నాయి. మండు వేసవిలో రెండు నెలలపాటు సిక్సర్లు, ఫోర్ల వర్షంలో తడిసి మురిసేందుకు అభిమానులు రెడీ అయ్యారు. వారిని ఏ మాత్రం నిరాశపర్చకుండా పైసా వసూల్ వినోదాన్ని అందించేందుకు ఆటగాళ్లు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
News March 21, 2025
జస్టిస్ వర్మపై అభిశంసనకు సిద్ధంగా కేంద్రం?

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు చర్యలను బట్టి నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఆయనపై అత్యున్నత న్యాయస్థానం అంతర్గత విచారణకు ఆదేశించింది. ఢిల్లీ నుంచి తిరిగి పాత చోటికే బదిలీ చేసింది. ఈ నిర్ణయాలను అలహాబాద్ సహా అనేక బార్ అసోసియేషన్స్ వ్యతిరేకించాయి. కొలీజియం వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి.
News March 21, 2025
ఔరంగజేబు సమాధిని కూల్చే అవకాశం ఉందా?

మహారాష్ట్ర ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కార్‌కు దానిని కూల్చే అధికారం ఉందా అనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా దీనిని కూల్చే హక్కు రాష్ట్రానికి లేదు. పురాతన స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, అవశేషాల చట్టం, 1958 కింద దీనికి ASI రక్షణ కల్పిస్తోంది. ఇటువంటి స్థలాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా డీ-నోటిఫై చేసే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంది.