News July 1, 2024
ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా దినేశ్ కార్తీక్

మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌ను మెన్స్ టీమ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమించినట్లు ఆర్సీబీ ప్రకటించింది. DK మెంటార్‌గానూ వ్యవహరించనున్నట్లు ట్వీట్ చేసింది. ‘ఇతడిని క్రికెట్ నుంచి దూరం చేయవచ్చు గానీ ఇతడి నుంచి క్రికెట్‌ను దూరం చేయలేము. 12th మ్యాన్ ఆర్మీ’ అని పేర్కొంది. ఈ ఏడాది IPLలో ఆర్సీబీ తరఫున ఆడిన DK రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 21, 2025
OTTలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’

బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.170 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించగా, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు.
News February 21, 2025
శివరాత్రి జాతరకు ఘనంగా ఏర్పాట్లు

TG: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం శివరాత్రి వేడుకకు ముస్తాబవుతోంది. ఈ నెల 25,26,27 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువు మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయం వరకూ ఉచిత బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు.
News February 21, 2025
మా దేశంలో ఉండొద్దు.. బీబీసీకి అజెర్‌బైజాన్ ఆదేశాలు

తమ దేశంలోని కార్యాలయాలు మూసేసి వెళ్లిపోవాలని వార్తాసంస్థ బీబీసీని అజెర్‌బైజాన్ ఆదేశించింది. తమ చట్టప్రకారం కార్యాలయం నడిపే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చిచెప్పింది. దీంతో తమ కార్యాలయం మూసేయక తప్పలేదని, మీడియా స్వేచ్ఛను అజెర్‌బైజాన్ తుంగలో తొక్కిందని బీబీసీ ఓ ప్రకటనలో ఆరోపించింది. బీబీసీ ఆ దేశంలో 1994 నుంచి పనిచేస్తోంది. మరోవైపు.. BBC ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోందని అజెర్‌బైజాన్ మండిపడింది.