News June 2, 2024

రిటైర్మెంట్‌తో దినేశ్ కార్తీక్ సరికొత్త రికార్డు

image

టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇండియా తరఫున అత్యధిక కాలం క్రికెట్ ఆడిన వికెట్ కీపర్‌గా డీకే నిలిచారు. కార్తీక్ భారత్ తరఫున 2004 సెప్టెంబర్ 5న తొలి మ్యాచ్ ఆడారు. చివరి మ్యాచ్ 2022 నవంబర్ 2న ఆడారు. అతడి ఇంటర్నేషనల్ కెరీర్ 18ఏళ్ల 58 రోజులు సాగింది. 79 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 1752 రన్స్, 48 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 686 రన్స్ చేశారు.

Similar News

News December 25, 2025

వంటింటి చిట్కాలు

image

* ఖీర్, పాయసం లాంటివి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* పకోడీలు కరకరలాడకపోతే బజ్జీల పిండిలో ఒకట్రెండు చెంచాల బియ్యప్పిండి కలిపి చూడండి.
* సెనగలను ఉడికించిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి వాడితే పోషకాలు అందుతాయి.

News December 25, 2025

జామలో కాయకుళ్లు తెగులు – నివారణ

image

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.

News December 25, 2025

సోషల్‌ మీడియా వాడేందుకు సైనికులకు అనుమతి?

image

భారత సైన్యం సోషల్ మీడియా నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, X వంటి యాప్‌లను వాడేందుకు సైనికులు, అధికారులకు అనుమతి ఇచ్చినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే సమాచారం తెలుసుకోవడం, కంటెంట్ చూడటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పోస్ట్, లైక్, కామెంట్ చేయడానికి పర్మిషన్ లేదని సమాచారం. హనీ ట్రాప్స్ వంటి ముప్పు నేపథ్యంలో భద్రతా నియమాలు పాటిస్తూనే ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.