News April 15, 2025
లా కమిషన్ ఛైర్మన్‌గా దినేశ్ మహేశ్వరి

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి 23వ లా కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హితేశ్ జైన్, DP వర్మను సభ్యులుగా నియమించింది. 2027 ఆగస్టు 31వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Similar News
News April 18, 2025
కథలాపూర్ పీహెచ్సీలో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తినష్టం

కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ గదిలో శుక్రవారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో రూ.25 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాక్సినేషన్ గదిలోని నాలుగు ఫ్రిడ్జ్లు, వాక్సిన్లు పూర్తిగా కాలిపోయాయి.
News April 18, 2025
కాలేయ ఆరోగ్యం: ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

శరీరంలోని మలినాల్ని శుభ్రం చేయడంలో లివర్‌దే ప్రధాన పాత్ర. అంతటి కీలకమైన లివర్లో ఏదైనా సమస్య తలెత్తితే కనిపించే కొన్ని లక్షణాలు:
-> కడుపునిండా తింటూ కంటినిండా నిద్రపోతున్నా నీరసంగానే అనిపిస్తుండటం, తరచూ కామెర్లు రావడం, కళ్లు, చర్మం పసుపురంగులో ఉండటం, విరోచనాల రంగులో మార్పు, పొట్టకు కుడివైపు పైన నొప్పి రావడం, వాంతులు, కాళ్లు-మడమల్లో వాపు ఉంటే లివర్ టెస్ట్ చేయించుకోవాలి.
*రేపు కాలేయ ఆరోగ్య దినోత్సవం
News April 18, 2025
అమెరికా వైమానిక దాడి.. యెమెన్‌లో 74 మంది మృతి

యెమెన్‌లోని ఆయిల్ పోర్టుపై US చేసిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 74కు చేరింది. ఈ ఘటనలో 171 మంది గాయపడినట్లు హౌతీ గ్రూప్ వెల్లడించింది. నెలరోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇదే అత్యంత దారుణమైన దాడి అని తెలిపింది. కాగా ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై హౌతీల దాడులను ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. వారికి నరకాన్ని చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో US ఆర్మీ హౌతీలపై విరుచుకుపడుతోంది.