News December 18, 2024

డింగా.. డింగా: ప్రజల్ని వణికిస్తున్న కొత్త రోగం!

image

ఉగాండాలో కొత్త రోగం పుట్టుకొచ్చింది. పేరు డింగా డింగా. అంటే డాన్స్ చేస్తున్నట్టు వణికిపోవడమని అర్థం. కొన్నిరోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధితో అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంది. ఎందువల్ల వస్తుందో, ఏ మందులు వాడాలో తెలియదు. 300+ కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయపడుతున్నారు. రోగం వచ్చిందంటే చాలు నియంత్రణ లేకుండా ఒళ్లు ఊగిపోతుంది. జ్వరం, వీక్‌నెస్, పక్షవాతం వచ్చిన ఫీలింగ్ దీని లక్షణాలు. కొందరు నడవలేకపోతున్నారు.

Similar News

News October 29, 2025

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీకి సీఎం గ్రీన్‌సిగ్నల్

image

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలన్న ఇంజినీర్ల ప్రతిపాదనకు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని నుంచి సుందిళ్లకు 80TMCల నీటిని గ్రావిటీ ద్వారా తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో MHలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని నీటిపారుదల శాఖ సమీక్షలో సూచించారు.

News October 29, 2025

ఇవాళ స్కూళ్లకు సెలవు

image

AP: తీవ్ర తుఫానుతో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో విద్యాసంస్థలకు నేడూ సెలవులు ఉండనున్నాయి. విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సెలవు ఇచ్చారు. కాకినాడలో 31 వరకు సెలవులు కొనసాగుతాయి. నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో కాలేజీలకు ఇవాళ సెలవు ఉంది.

News October 29, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, ఫైనాన్స్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC,ST,దివ్యాంగులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/