News March 5, 2025

సమంతతో సినిమా అంటూ ప్రచారం.. ఖండించిన డైరెక్టర్

image

సమంతతో తాను మరో సినిమా తెరకెక్కించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ‘ఓ బేబీ’ మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి ఖండించారు. ఒకవేళ ఆమెతో మూవీ చేస్తే ఆ విషయాన్ని తానే అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. నందినికి సమంత బర్త్‌డే విషెస్ చెబుతూ ‘అందరి కళ్లు మీపైనే ఉన్నాయి. ఇది గొప్ప ఏడాది కాబోతోంది. పని ప్రారంభించండి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో వీరు మరో మూవీ చేయనున్నారనే టాక్ మొదలైంది.

Similar News

News January 9, 2026

అయోధ్యలో నాన్-వెజ్ ‌నిషేధం

image

అయోధ్య, పంచకోషీ యాత్ర రూట్లలో నాన్-వెజ్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు UP ప్రభుత్వం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. హోటల్స్, రెస్టారెంట్లలో నాన్-వెజ్ పదార్థాల తయారీ, అమ్మకాలపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొంతమంది టూరిస్టులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని తింటున్నారని ఆరోపణలున్నాయి. దీంతో ఆన్‌లైన్ డెలివరీలపైనా నిషేధం విధించింది.

News January 9, 2026

మాయమైపోతున్నారమ్మా.. హరిదాసులు, డూడూ బసవన్నలు

image

‘అయ్యవారికి దండంపెట్టు..అమ్మగారికి దండంపెట్టు’ అంటూ సంక్రాంతి సీజన్‌లో సందడి చేసే గంగిరెద్దుల కళాకారులు అంతరించిపోతున్నారు. ఒకప్పుడు సన్నాయి మేళాలు, అలంకరించిన బసవన్నలు, కుటుంబం, వంశాలను కీర్తిస్తూ పద్యాలు పాడే హరిదాసులు ఇంటింటికీ తిరుగుతూ సందడి చేసేవారు. తగ్గిన ఆదరణ, పెరిగిన ఖర్చులతో భవిష్యత్ తరాల మనుగడ కష్టమవుతుందనే కారణంతో పూర్వీకుల కళను వదిలి బరువెక్కిన హృదయంతో వలసబాట పడుతున్నారు.

News January 9, 2026

BJP కొత్త ఆయుధంగా సెన్సార్ బోర్డు: స్టాలిన్

image

సెన్సార్ బోర్డుపై తమిళనాడు CM స్టాలిన్ ఫైర్ అయ్యారు. CBI, ED, IT శాఖ మాదిరే ఇప్పుడు సెన్సార్ బోర్డు BJP కొత్త ఆయుధంగా మారిందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ విషయంలోనే ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం 25కట్స్‌ సూచిస్తూ U/A సర్టిఫికెట్‌ను CBFC జారీ చేసింది. 1965 యాంటీ హిందీ ఆందోళన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి DMK సపోర్ట్ ఉంది.