News April 8, 2025
‘రాజాసాబ్’ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీపై డైరెక్టర్ మారుతి ఓ అప్డేట్ ఇచ్చారు. ‘సీజీ వర్క్ కంప్లీట్ కాగానే ‘రాజా సాబ్’ మూవీ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటిస్తారు. ఈ సినిమా విడుదలకు మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టండి. మీ అంచనాలు అందుకునేందుకు మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. మా హార్డ్ వర్క్‌ను చూపించేందుకు ఎదురు చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News April 17, 2025
శాంసన్‌కు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?

DCతో మ్యాచులో RR కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యారు. పక్కటెముకల్లో నొప్పి రావడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడారు. అయితే మ్యాచ్ అనంతరం తాను ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు సంజూ స్పష్టం చేశారు. ఇవాళ స్కానింగ్ జరిగాక గాయం తీవ్రతపై స్పష్టత వచ్చే అవకాశముంది. RR తన తర్వాతి మ్యాచును ఈనెల 19న LSGతో ఆడనుంది. ఆలోగా సంజూ కోలుకునే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
News April 17, 2025
స్కూళ్లకు సెలవులు.. కీలక ఆదేశాలు

TG: ఈ నెల 24 నుంచి స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం బడులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23న విద్యార్థులందరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని స్పష్టం చేసింది. జూన్ 12న తిరిగి స్కూళ్లు పునఃప్రారంభించాలని పేర్కొంది. అటు పలు ప్రైవేట్ విద్యాసంస్థలు సైతం 24కు కంటే ముందే సెలవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.
News April 17, 2025
పారిపోయి పెళ్లి చేసుకున్న జంటలకు రక్షణ కల్పించలేం: హైకోర్టు

తల్లిదండ్రులను ఎదిరించి, పారిపోయి పెళ్లి చేసుకునే జంటలకు రక్షణ కల్పించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ జంట ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సమాజాన్ని ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. నిజంగా తమకు ముప్పు ఉంటేనే రక్షణ కోరాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు చిత్రకూట్ జిల్లాకు చెందిన ఓ నూతన జంట తమకు రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.