News April 15, 2024
రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ శంకర్ కూతురు

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌ను ఆమె వివాహమాడారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఐశ్వర్య శంకర్ 2021లో క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల్లోనే వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.
Similar News
News April 10, 2026
అభిమానికి కొత్త ఫోన్ ఇచ్చిన సంజూ.. నెట్టింట ప్రశంసలు

రోడ్డుపై సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌కు టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంపై ప్రశంసలొస్తున్నాయి. కేరళంలోని పాలక్కాడ్ సమీపంలో కాల్ మాట్లాడేందుకు సంజూ కారును ఆపారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శబరీష్ అనే యువకుడు సంజూను చూసి సెల్ఫీ అడిగాడు. అయితే శబరీష్ ఫోన్ డిస్‌ప్లే పాడయిందని గమనించిన సంజూ వెంటనే ఓ కొత్త ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
News April 10, 2026
IPLలో నయా హిట్టర్.. సినిమా చూపించాడు!

KKRతో మ్యాచులో ఓడిపోతుందనుకున్న LSGకి యువ బ్యాటర్ ముకుల్ చౌదరి మరుపురాని <<19611824>>విజయాన్ని<<>> అందించారు. 16 ఓవర్ల తర్వాత LSG విజయానికి 24 బంతుల్లో 54 రన్స్ కావాలి. అప్పటికే మెయిన్ బ్యాటర్లందరూ ఔటవడంతో LSG ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ముకుల్ 2 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకుపడ్డారు. చివరి 4 ఓవర్లలో ఆయనొక్కరే 52 పరుగులు చేయడం గమనార్హం.
* మ్యాచ్ ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.
News April 10, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


