News March 31, 2025
మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడి అరెస్ట్!

ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాకు షాక్ తగిలింది. రేప్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను డైరెక్టర్ లైంగికంగా వేధించాడని, వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ పేరుతో తెరకెక్కించే సినిమాలో మోనాలిసాను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు సనోజ్ ప్రకటించారు.
Similar News
News April 3, 2025
హను రాఘవపూడితో ప్రభాస్ మరో సినిమా?

ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హను డైరెక్షన్ పట్ల ముగ్ధుడైన ప్రభాస్ ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని, కథ రెడీ చేసుకోవాలని సూచించారని సమాచారం. అయితే ఇది తెరకెక్కేందుకు చాలా కాలం పడుతుందని సినీవర్గాలంటున్నాయి. డార్లింగ్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్నారు.
News April 3, 2025
పాయింట్స్ టేబుల్ టాప్లో పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025లో రెండు వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికల పంజాబ్ కింగ్స్ టాప్లో నిలిచింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి ఎరగకుండా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు టాప్లో ఉన్న ఆర్సీబీ.. గుజరాత్పై ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత GT, MI, LSG, CSK, SRH, RR, KKR కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే SRH vs KKR మ్యాచ్ తర్వాత సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది.
News April 3, 2025
ముస్లింలను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు: రాహుల్

దేశంలోని ముస్లింలను అణచివేసి, వారి ఆస్తి హక్కులను హరించేందుకు వక్ఫ్ బిల్లును ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ముస్లింలను లక్ష్యంగా చేసుకునే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. భవిష్యత్లో దీనిని ఇతర వర్గాలపై కూడా ప్రయోగించవచ్చు. ఈ బిల్లు ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుంది. ఇది దేశ ఆలోచనలపై దాడి చేస్తుంది’ అని ఆయన ఎక్స్లో తీవ్ర విమర్శలు చేశారు.