News September 26, 2025
డైరెక్టర్ YVS చౌదరికి మాతృ వియోగం

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి రత్నకుమారి (88) నిన్న రాత్రి 8.31గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా తల్లితో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ YVS సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, అన్నగారిని కలవడానికి అమ్మ వెళ్లిపోయారు’ అంటూ రాసుకొచ్చారు.
Similar News
News February 11, 2026
రూ.55లక్షల తలసరి ఆదాయమే టార్గెట్: గవర్నర్

AP: 2047 నాటికి రూ.308లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. రూ.55లక్షల తలసరి ఆదాయమే లక్ష్యమని తెలిపారు. ‘సూపర్-6 సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి కార్యకలాపాలను పున:ప్రారంభించడంపై దృష్టిపెట్టాం. విధానాలు, వ్యయప్రాధాన్యతలలో కీలక సవరణలు చేశాం’ అని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ వివరించారు.
News February 11, 2026
ఆకాశంలో అద్భుతం.. ‘హృదయ’ కాంతిని చూడండి!

ప్రేమికుల రోజుకు ముందు ఆకాశంలో అద్భుతం జరిగింది. హృదయపు ఆకారంలో ఏర్పడిన నార్తర్న్ లైట్స్ కనువిందు చేస్తున్నాయి. వినీల ఆకాశంలో ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తున్న ‘హార్ట్’ను నార్వేలో క్రిస్టొఫర్ వెంజెన్ బంధించారు. శీతాకాలంలో ఆర్కిటిక్ సమీపంలో ఈ నార్తర్న్ లైట్స్ కనిపిస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే ఛార్జ్‌డ్ కణాలు ఆక్సిజన్, నైట్రోజన్‌తో ఢీకొన్నప్పుడు ఆకుపచ్చ, పింక్, ఎరుపు, నీలం రంగు కాంతులను వెదజల్లుతాయి.
News February 11, 2026
నటుడి ఆవేదన.. సాయానికి ముందుకొస్తున్న సెలబ్రిటీలు

₹9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్‌పాల్ యాదవ్ <<19103948>>జైలులో సరెండరైన<<>> విషయం తెలిసిందే. ఆదుకునేందుకు ఎవరూ రాలేదంటూ వాపోయిన ఆయన కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. రాజ్‌పాల్‌కు తన చిత్రంలో అవకాశం ఇస్తానని సోనూ సూద్ తెలిపారు. తాను ₹1.1 కోట్లు ఇస్తానని GemTunes Music ఓనర్ రావ్ ఇంద్రిజిత్ సింగ్ ప్రకటించారు. నటుడు గుర్మీత్, పొలిటీషియన్ తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా సాయం చేస్తామని అన్నారు.


