News October 11, 2024
దేవర-2పై డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

దేవర-2లో నటీనటులపై డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్ ఉంటే బాగుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అది జరుగుతుందో లేదో తెలియదన్నారు. బాలీవుడ్ స్టార్లను అతిథి పాత్రలకు తీసుకోవడం తనకు ఇష్టముండదని, ముఖ్యమైన క్యారెక్టర్లే ఇస్తానని పేర్కొన్నారు. నటించబోయే వారి వివరాలను త్వరలోనే పాత్రలవారీగా వెల్లడిస్తామని తెలిపారు.
Similar News
News December 5, 2025
హోమ్ లోన్ EMIపై ఎంత తగ్గుతుందంటే?

RBI రెపో రేటును తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ తగ్గింపుతో బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తాయంటున్నారు. ఫలితంగా గృహ, వాహన రుణాలపై నెలవారీ ఈఎంఐలు తగ్గి రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్న వారికి నెలకు దాదాపు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
News December 5, 2025
అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తున్నాయా?

అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడాన్ని హిర్సుటిజం అంటారు. ముందు దీనికి చికిత్స తీసుకుని ఆ తర్వాత వెంట్రుకల పెరుగుదలను ఆపడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. వెంట్రుకలు తొలగించడానికి పర్మనెంట్ హెయిర్ లేజర్ రిడక్షన్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. అయితే హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి ఎక్కువ సెషన్లు తీసుకోవాల్సి వస్తుంది. మూల కారణాన్ని తెలుసుకుంటే సెషన్ల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
News December 5, 2025
మరో సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

వికల్ప్ పేరుతో మావోయిస్టులు మరో సంచలన లేఖ విడుదల చేశారు. దేవ్జీ సహా మల్లా రాజిరెడ్డి తమతోనే ఉన్నారని పేర్కొన్నారు. లొంగిపోవడానికి వాళ్లు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ పోలీసులకు చెప్పారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అతడి హత్యకు నలుగురు వ్యక్తులే కారణమని లేఖలో వెల్లడించారు. కోసాల్ అనే వ్యక్తి అతడి హత్యకు ప్రధాన కారణమని మావోయిస్టులు ఆరోపించారు.


