News September 19, 2024

‘కూలీ’ మూవీ సీన్ లీక్‌పై డైరెక్టర్ రియాక్షన్

image

‘కూలీ’ మూవీ సీన్ లీక్ అవ్వడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ స్పందించారు. ‘ఒక్క రికార్డింగ్‌తో రెండు నెలలుగా మేం పడ్డ కష్టం వృథా అయింది. ఇలాంటివి ప్రోత్సహించొద్దని ప్రతి ఒక్కరిని కోరుతున్నా’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫైట్ సీన్‌లో నాగార్జున ఉన్న వీడియోను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

Similar News

News November 27, 2025

ఖమ్మం: నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి దశలో ఏడు మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కొణిజర్ల, వైరా, మధిర, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News November 27, 2025

ఆ మృగం మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్

image

వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌ వద్ద <<18399882>>కాల్పుల ఘటనపై<<>> US అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. నిందితుడిని మృగంగా సంబోధిస్తూ.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘ఇద్దరు నేషనల్ గార్డ్‌మెన్‌లను ఆ యానియల్ తీవ్రంగా గాయపర్చింది. వారికి చికిత్స అందిస్తున్నాం. నిందితుడిని వదలబోం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాల్పుల నేపథ్యంలో వైట్‌హౌస్‌ను లాక్‌డౌన్ చేసిన విషయం తెలిసిందే.

News November 27, 2025

చెప్పులు, చెత్త డబ్బా.. ‘సర్పంచ్’ గుర్తులివే..

image

TG: సర్పంచ్ అభ్యర్థులకు SEC 30గుర్తులు కేటాయించింది. వీటిలో చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మెన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ గుర్తులున్నాయి. వార్డు అభ్యర్థులకు 20గుర్తులిచ్చింది.