News July 21, 2024
‘సర్ మీకిదే లాస్ట్ రీమేక్ కావాలి’.. నెటిజన్ కామెంట్కు డైరెక్టర్ రిప్లై

డైరెక్టర్ హరీశ్ శంకర్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటారనే పేరుంది. ప్రస్తుతం ఆయన రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ కామెంట్కు హరీశ్ స్పందించారు. ‘సర్ ఇదే మీకు లాస్ట్ రీమేక్ కావాలని ఆశిస్తున్నా. మీలో మంచి రచయిత ఉన్నారు. సొంత కథలతో మ్యాజిక్ చేయగలరు’ అని సదరు నెటిజన్ రాసుకొచ్చాడు. ‘ఈ మూవీ చూశాక రీమేక్ అని ఫీలైతే అప్పుడు మాట్లాడుకుందాం’ అంటూ డైరెక్టర్ సమాధానమిచ్చారు.
Similar News
News December 11, 2025
రుణ విముక్తి కోసం రేపు ఇలా చేయండి: పండితులు

రుణబాధలు తొలగిపోవాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కనకధారా స్తోత్రం చదివి, పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే ఆర్థిక బాధలు పోతాయంటున్నారు. ‘మహిళలు స్నానం చేసే, ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వేయాలి. ఫలితంగా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణ విముక్తి కూడా కలుగుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందాలంటే పూజా మందిరంలో కూర్మం(తాబేలు) ఉంచండి’ అని సూచిస్తున్నారు.
News December 11, 2025
ఆలుమగల కలహం, ఆరికకూడు వంట

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలు, అరికల (కొర్రలు) అన్నం వండడానికి పట్టేంత తక్కువ సమయంలోనే సద్దుమణుగుతాయని ఈ సామెత చెబుతుంది. భార్యభర్తల మధ్య కలహాలు దీర్ఘకాలం ఉండవు. అవి తాత్కాలికమైనవి. త్వరగా సమసిపోతాయి. ఆ కలహాలు వారి మధ్య అనురాగాన్ని మరింత పెంచుతాయి. అలాగే కొర్రల అన్నం కూడా తక్కువ సమయంలోనే సిద్ధమై ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ సామెత అర్థం.
News December 11, 2025
పాసులుంటేనే ఎంట్రీ!

TG: ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, CM రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఈ నెల 13న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. పాసులు ఉన్నవారే మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి రావాలని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. మిగతావారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ఆరోజు స్టేడియం వద్ద రద్దీ లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మెస్సీ 13, 14, 15 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు.


