News August 20, 2025
బిల్లుపై భిన్నాభిప్రాయాలు!

ఏదైనా నేరం కింద పీఎం, సీఎం, మినిస్టర్లు అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైలులో ఉంటే పదవుల నుంచి తొలగించే బిల్లుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చట్టం వల్ల నేరాలు చేయాలనే ఆలోచన రాజకీయ నాయకుల మదిలో నుంచి తొలగిపోతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో చేయని నేరానికి 30 రోజులు జైలులో ఉంచి, పదవిని పోగొట్టే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ బిల్లుపై మీ కామెంట్?
Similar News
News August 20, 2025
శ్రీశైలం MLA తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: అటవీ సిబ్బందితో శ్రీశైలం MLA రాజశేఖర్‌రెడ్డి <<17465291>>వివాదం<<>>పై CM చంద్రబాబు ఆరా తీశారు. ఘర్షణ జరిగిన తీరుపట్ల ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. CM ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News August 20, 2025
జియో యూజర్లకు మరో షాక్

జియో సంస్థ మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించింది. రూ.799తో 84 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 GB డేటా, 100 SMSలు అందించే ప్లాన్‌ను రద్దు చేసింది. ఇక నుంచి ఈ సేవలు కావాలనుకుంటే యూజర్లు రూ.889తో రీఛార్జ్ చేసుకోవాలి. రూ.889 ప్లాన్‌లో జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. కాగా రెండు రోజుల క్రితం రూ.249 ప్లాన్‌ను జియో తొలగించిన సంగతి తెలిసిందే.
News August 20, 2025
అలాంటి సాదా బైనామాలు చెల్లుతాయి: AG

TG: సాదా బైనామాలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగ్గా, రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. 12 ఏళ్ల పాటు భూమి స్వాధీనంలో ఉండి, ప్రభుత్వం నిర్దేశించినట్లు రాతపూర్వక ఒప్పందం ఉంటే సాదా బైనామాలు చెల్లుతాయని AG కోర్టుకు వివరించారు. 2020లో సాదా బైనామాలను ఆపాలన్న మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. అడ్వకేట్ జనరల్ కౌంటర్‌కు రిప్లై ఇచ్చేందుకు పిటిషనర్లు సమయం కోరడంతో విచారణ ఈనెల 26వ తేదీకి వాయిదా పడింది.