News July 2, 2024
ప్రభుత్వ వెబ్‌సైట్లలో ముఖ్యమైన సమాచారం అదృశ్యం: KTR

TG: రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం అయిందని KTR ట్వీట్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని, విలువైన సమాచారాన్ని భద్రపరచాలని CS శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని వెబ్‌సైట్లు తొలగించారు. ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని ఫొటోలు, వీడియోలను లేకుండా చేశారు’ అని ఆరోపించారు.
Similar News
News March 28, 2026
‘అమరావతి’పై నేడు ప్రత్యేకంగా అసెంబ్లీ.. వైసీపీ హాజరుపై సందిగ్ధత

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఈ మేరకు విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్‌తోపాటు దాదాపు 20 మంది MLAలు ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ MLAల హాజరుపై ఇప్పటికీ స్పష్టత లేదు. చట్టబద్ధతపై మండలిలోనూ చర్చించాలని ఆ పార్టీ నేత సజ్జల ఇటీవల డిమాండ్ చేశారు.
News March 28, 2026
నేటి నుంచే IPL సమరం

వేసవిలో వినోదాన్ని పంచేందుకు IPL సిద్ధమైంది. నేటి నుంచి రెండు నెలల పాటు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. మొత్తం 10 జట్లు 74 మ్యాచులు ఆడనున్నాయి. నేడు జరిగే తొలిపోరులో SRH, RCB తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య 26 మ్యాచులు జరగ్గా SRH 14, RCB 11 గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారీ హిట్టర్లతో కూడిన ఆరెంజ్ ఆర్మీ ఇవాళ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News March 28, 2026
కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్.. రోజుకు 5 గంటలే

AP: కోచింగ్ సెంటర్ల నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆదివారం సెలవు ఇవ్వాలి. రోజుకు 5 గంటలే నడపాలి. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇంటర్నల్‌గా ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఫీజుల కోసం వేధించొద్దు. భవనం రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. వీటిని ఉల్లంఘిస్తే ₹లక్ష వరకు ఫైన్ ఉంటుంది. అయినా రిపీట్ అయితే రిజిస్ట్రేషన్ రద్దవుతుంది.


