News January 30, 2025
1998లో అదృశ్యం.. కుంభమేళాలో అఘోరాగా ప్రత్యక్షం

27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ భార్య కుంభమేళాలో గుర్తించారు. ఝార్ఖండ్కు చెందిన గంగాసాగర్ 1998లో భార్య ధన్వా దేవి, పిల్లలను వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం వారు వెతుకుతూనే ఉన్నారు. కుంభమేళాకు వెళ్లిన కుటుంబసభ్యులకు ఆయన అఘోరాగా కనిపించారు. అతడి నుదుటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు గుర్తించి తన భర్తేనని ధన్వా దేవి గుర్తించారు. కానీ వారితో వచ్చేందుకు ఆయన నిరాకరించారు.
Similar News
News November 19, 2025
ఈ నెల 27న రాహుల్ పెళ్లి.. సీఎంకు ఆహ్వానం

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న ప్రియురాలు హరిణ్యతో ఆయన వివాహం జరగనుంది. కాబోయే దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్యా రెడ్డి. ఇక రాహుల్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.
News November 18, 2025
జైల్లో మొహియుద్దీన్పై దాడి!

టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టై అహ్మదాబాద్ సబర్మతీ జైల్లో ఉన్న డా.అహ్మద్ మొహియుద్దీన్పై దాడి జరిగింది. తోటి ఖైదీలు అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్ను పోలీసులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల వ్యర్థాలతో ‘రెసిన్’ అనే విషాన్ని తయారు చేసి వేలాది మందిని చంపాలని మొహియుద్దీన్ ప్రయత్నించాడు. ఈక్రమంలోనే HYD రాజేంద్రనగర్లో గుజరాత్ ATS అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.
News November 18, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై సంధ్య కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎవరి అనుమతితో కూల్చివేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని సీరియస్ అయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.


