News May 19, 2024

నా సినిమాల ఫలితాల విషయంలో నిరుత్సాహపడ్డా: సుధీర్

image

మహేశ్ బాబుతో కలిసి నటించేందుకు తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని హీరో సుధీర్ బాబు అన్నారు. ఏదొక రోజు తమ మల్టీస్టారర్ మూవీ సాధ్యం కావొచ్చని చెప్పారు. తాను నటించిన ‘హరోం హర’ మూవీ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రేమకథా చిత్రమ్ మినహా తన మిగతా సినిమాల ఫలితాల విషయంలో నిరుత్సాహపడ్డానని అన్నారు. కమర్షియల్‌గా బెటర్‌గా ఉండాల్సిన చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఫెయిల్ అయ్యానేమోనని చెప్పుకొచ్చారు.

Similar News

News October 29, 2025

భారీ వర్షాలు.. కల్లాల మీద ధాన్యం ఉందా?

image

కోతకోసి కుప్ప మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రైతులు రక్షించుకోవాలి. నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డిని కలిపితే గింజను వారం రోజులపాటు మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పార పట్టి నిలువ చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది.

News October 29, 2025

డౌన్స్‌ సిండ్రోమ్ పిల్లలకు ఈ పరీక్షలు చేయిస్తున్నారా?

image

డౌన్స్‌ సిండ్రోమ్‌ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికోసారి కంటి పరీక్షలు, 6-12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. ప్రతి ఆర్నెల్లకోసారి దంత పరీక్షలు, 3-5 ఏళ్లకోసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్‌రే తీసి పరీక్షిస్తూ ఉండాలి. అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే పాప్‌ స్మియర్‌ పరీక్ష, సంవత్సరానికోసారి థైరాయిడ్‌ పరీక్ష చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

News October 29, 2025

49 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్‌లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, ITI, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590, SC/ST/PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://bdl-india.in/