News April 5, 2024
హోమ్ లోన్లు తీసుకున్నవారికి నిరాశే!

RBI రెపో రేట్(6.5%) తగ్గించకపోవడంతో హోమ్ లోన్లపై వడ్డీ రేట్ కూడా యథాతథంగా ఉండనుంది. దీంతో హోమ్ లోన్లు తీసుకున్న, కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వారికి ఊరట లభించలేదు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.30%, HDFC బ్యాంక్ – 8.35%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 8.40%, బ్యాంక్ ఆఫ్ బరోడా – 8.40%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 8.45%, ICICI బ్యాంక్ – 9.5% నుంచి హోమ్ లోన్లపై వడ్డీ వసూలు చేస్తున్నాయి.
Similar News
News October 22, 2025
యూడైస్లో పేరుంటేనే ఇంటర్ పరీక్షలకు!

TG: యూడైస్(యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫమేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నిబంధన ఇంటర్ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇందులో పేరు నమోదు తప్పనిసరని, అలా ఉంటేనే ఇంటర్ పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. యూడైస్లో పేరు లేకుంటే ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు వీలు ఉండదు. ఇప్పటివరకు 75% విద్యార్థుల పేర్లు నమోదవ్వగా మరో 25% పెండింగ్లో ఉన్నాయి. ఆధార్ తప్పుల సవరణ దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.
News October 22, 2025
ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ప్రజలెవరూ బయటికి రావొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
News October 22, 2025
మిరప సాగు – విత్తన మోతాదు, విత్తన శుద్ధి

వర్షాధారంగా మిరపను సాగు చేస్తారు. ఈ పంటకు నల్ల, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. మిరపకు మెత్తని దుక్కికావాలి. అందుకే నేలను 3-4 సార్లు దున్ని 2సార్లు గుంటక తోలాలి. విత్తనం ఎద బెట్టేందుకు ఎకరానికి 2.5KGల విత్తనం అవసరం. రసం పీల్చే పురుగుల నివారణకు కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ను, తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధిచేయాలి.