News September 15, 2024
‘దేవర’ ఔట్డోర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు అనుమతి నిరాకరణ!

NTR, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా ఔట్ డోర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు పోలీసుల నుంచి అనుమతి రాలేదని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్టీఆర్కు ఉన్న పాపులారిటీ దృష్ట్యా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. కాగా ఈ మూవీ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.
Similar News
News November 24, 2025
ఆయుధాలు వీడేందుకు సిద్ధం: మావోయిస్టుల లేఖ

ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ MH, MP, ఛత్తీస్గఢ్ సీఎంలకు మావోయిస్టు ప్రతినిధి పేరిట లేఖ రాశారు. ‘పోరాటం నిలిపివేయాలన్న కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా నిర్ణయానికి మద్దతిస్తున్నాం. ఆయుధాలు విడిచి ప్రభుత్వ పునరావాసం పొందాలనుకుంటున్నాం. అయితే సమష్టి నిర్ణయానికి రావడానికి మాకు 15 FEB 2026 వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నాం. దీని వెనుక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదు’ అని తెలిపారు.

టమాటా కేజీ రూ.80!

TG: నిన్న, మొన్నటి వరకు కేజీ రూ.20-40కే లభించిన టమాటా ఇప్పుడు కొండెక్కింది. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్లలో టమాట రేటు చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. కొన్ని మార్కెట్లలో అయితే టమాటానే దొరకడం లేదు. ధర వెచ్చించలేక వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బ తినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.