News October 16, 2024

ఫ్యూయెల్ కోసం వెళ్లి 94 మంది మృతి

image

నైజీరియాలోని మాజియాలో ఫ్యూయెల్ ట్యాంకర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 94మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 50 మంది గాయపడ్డారు. ఎదురుగా ఉన్న ట్రక్కును తప్పించే క్రమంలో ఈ ట్యాంకర్ పడిపోయింది. అయితే ఫ్యూయెల్ తీసుకొనేందుకు స్థానికులు ఆ ట్యాంకర్‌ను చుట్టుముట్టారు. ఆ సమయంలోనే ట్యాంకర్ పేలిందని పోలీసులు తెలిపారు.

Similar News

News February 10, 2026

BREAKING: టెట్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ టెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> ఉంచింది. జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగ్గా 30వ తేదీ కీ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి టెట్‌కు 2.37 లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.

News February 10, 2026

నెక్ట్స్ సినిమాపై గాసిప్స్.. అనిల్ రావిపూడి ఫన్నీ రియాక్షన్

image

‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్‌తో అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై Xలో అనిల్ ఫన్నీగా స్పందించారు. ‘నేను ఇంకా పేపర్‌పై పెన్ కూడా పెట్టలేదు. అప్పుడే నటీనటులు, కథ, టైటిల్ పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో! మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను. నా తర్వాతి సినిమా ఏంటి, ఎవరితో అనేది అతిత్వరలోనే చెబుతా’ అని తెలిపారు.

News February 10, 2026

శ్రీలంక జట్టుకు కీలక ప్లేయర్ దూరం

image

T20 WC జరుగుతున్న వేళ శ్రీలంక జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. అతని ఎడమ కాలి కండరాల్లో చీలిక ఏర్పడినట్లు MRI స్కానింగ్‌లో తేలడంతో జట్టు నుంచి తప్పించారు. హసరంగ స్థానంలో లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ దుషాన్ హేమంతకు జట్టులో చోటు కల్పించారు. 8వ తేదీ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే.