News November 1, 2024
కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
ఏపీలో నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు.
మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులుండగా ఇప్పటి వరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందించారు. పలు కారణాలతో ఇవాళ పెన్షన్ అందుకోలేని వారికి రేపు అందించనున్నారు. ఇటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించేందుకు ఇవాళ CM చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.
Similar News
News November 1, 2024
300 అప్లికేషన్స్, 500 ఈమెయిల్స్.. ఎట్టకేలకు ఉద్యోగం
పుణేకు చెందిన ధ్రువ్ లోయా అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన కృషి సోషల్ మీడియాలో వైరలవుతోంది. USలోనే చదువుకున్న అతను జాబ్ కోసం 5 నెలల్లో 300 దరఖాస్తులు, 500కుపైగా ఈమెయిల్స్ పంపారు. 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరవగా ఎట్టకేలకు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్టుగా కొలువు సాధించారు. ఈ విషయాన్ని అతను linkedinలో పోస్టు చేయగా అందరూ అభినందిస్తున్నారు.
News November 1, 2024
సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్
ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.
News November 1, 2024
OTTలోకి వచ్చేసిన విజయ్ ఆంటోనీ ‘హిట్లర్’
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ‘హిట్లర్’ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ధన శేఖరన్ దర్శకత్వం వహించారు. రియా సుమన్, గౌతం వాసుదేవ్ కీలకపాత్రలు పోషించారు. కాగా ‘బిచ్చగాడు’తో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.