News March 31, 2024
సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ: సజ్జల
AP: వాలంటీర్లపై EC ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘ఈసారి పెన్షన్లను వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి. మూడో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తాం. పెన్షనర్లు భయపడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. చంద్రబాబు కడుపు మంటతోనే వాలంటీర్ల సేవలను EC ద్వారా నిలుపుదల చేశారని విమర్శించారు.
Similar News
News January 2, 2025
నేటి ముఖ్యాంశాలు
* సూపర్-6 హామీలను కచ్చితంగా అమలు చేస్తాం: CBN
* పథకాలను మింగేసిన చంద్రబాబు, పవన్: వైసీపీ
* ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలకు రేవంత్ సూచన
* ఫార్ములా-ఈ కారు లొట్ట పీసు కేసు: కేటీఆర్
* సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులకు NHRC నోటీసులు
* పీఎం ఫసల్ బీమా యోజన నిధి రూ.69,515 కోట్లకు పెంపు
News January 2, 2025
భారత్-పాక్ మధ్య అణు స్థావరాల సమాచార మార్పిడి
30 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం భారత్, పాక్ తమ అణు స్థావరాల సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి. దౌత్య మార్గాల ద్వారా ఏక కాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే మత్స్యకార ఖైదీలు, కశ్మీర్, సీమాంతర ఉగ్రవాదంపైనా సమాచార మార్పిడి జరిగినట్లు వెల్లడించింది. అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన ఒప్పందం ప్రకారం 1992 నుంచి ఏటా జనవరి 1న ఈ కార్యక్రమం జరుగుతోంది.
News January 2, 2025
తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు విటిలిగో వ్యాధి
మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ అరుదైన చర్మ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. దీనిని కాస్మోటిక్ మేకప్‌తో కవర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. విటిలిగో(బొల్లి) అనే చర్మ సమస్యతో తాను సతమతమవుతున్నట్లు తెలిపారు. మొదట్లో ఈ విషయమై భయపడినా సినిమాల్లో బిజీ అవడంతో మరిచిపోయినట్లు చెప్పారు. కాగా విటిలిగో అంటు వ్యాధి కాకపోయినా దీనికి కచ్చితమైన నివారణ లేదు.