News October 5, 2024

ఇలా చేస్తే వాహనదారులకు రాయితీ!

image

TG: కాలం చెల్లిన వాహనాల్ని తుక్కుగా మార్చే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనుంది. ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ కింద బైక్స్‌కు లైఫ్ ట్యాక్స్‌లో ₹1,000-₹7,OOO, 4 వీలర్స్‌కు ₹15,000-₹50,000 రాయితీని కల్పించనుంది. కొత్తగా కొనే వాహనాల విలువను బట్టి డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. ఇది వ్యక్తిగత వాహనాలకు, రవాణా వాహనాలకు వేర్వేరు విధాలుగా వర్తించనుంది. 2 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి.

Similar News

News October 25, 2025

నలభైల్లో ఇలా సులువుగా బరువు తగ్గండి

image

40ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పులు, జీవక్రియలు నెమ్మదించి చాలామంది మహిళలు బరువు పెరుగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వయసు పెరుగుతున్నా వర్కవుట్‌ చేయడం మానకూడదు. సుఖ నిద్ర వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గడంతో పాటు హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. వీటితోపాటు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News October 25, 2025

ఘోర ప్రమాదం.. బస్సు నడిపింది ఇతనే!

image

AP: అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిన్న కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ బస్సును పల్నాడు(D) ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్య నడిపాడు. సాధారణంగా హెవీ లైసెన్స్ కోసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది. కానీ 5వ తరగతి వరకే చదువుకున్న లక్ష్మయ్య టెన్త్ నకిలీ సర్టిఫికెట్లతో లైసెన్స్ పొందాడు. 2014లోనూ లారీ నడుపుతూ యాక్సిడెంట్ చేయగా ఆ ఘటనలో క్లీనర్ చనిపోయాడు.

News October 25, 2025

‘మూడు రోజుల మురిపెం’.. చేయరుగా!

image

కర్నూలులో <<18088805>>బస్సు<<>> ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాత్రి పలు చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తిరుపతితో పాటు HYDలో సరైన పత్రాలు లేని బస్సులను గుర్తించి నిలిపివేశారు. అయితే ప్రమాద ఘటన జరిగిందని తూతూ మంత్రపు తనిఖీలు కాకుండా నిత్యం ఇలాగే కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. క్రమంతప్పకుండా తనిఖీలు చేస్తూ నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.