News December 24, 2024
పెండింగ్ ఛలాన్లపై డిస్కౌంట్.. పోలీసులు ఏమన్నారంటే?
వాహనదారులకు తెలంగాణ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారని, వాహనాలపై ఉన్న పెండింగ్ ఛలాన్లు చెల్లించేందుకు డిస్కౌంట్ ఇచ్చారనే మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వరకు బైక్ ఫైన్లపై 80%, కార్లపై 60% డిస్కౌంట్‌తో చెల్లించాలని మెసేజ్‌లో ఉంది. వాహనదారులు దీనిని నమ్ముతుండటంతో పోలీసులు స్పందించారు. ఈ ప్రకటన ఫేక్ అని, దీనిని నమ్మొద్దని సూచించారు.
Similar News
News December 25, 2024
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,209 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. మరోవైపు, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి నిన్న 1.40 లక్షల రూ.300 టికెట్లను ఆన్‌లైన్లో రిలీజ్ చేయగా అరగంటలోనే అయిపోయాయి.
News December 25, 2024
సినిమా ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే ప్రయత్నం: ఈటల
TG: CM రేవంత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని BJP MP ఈటల రాజేందర్ మండిపడ్డారు. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్‌కి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుందని.. వారి పర్యటనల్లో ముందస్తు ఏర్పాట్లు అవసరమన్నారు. ఏదీ ఏమైనా, ఎవరి నిర్లక్ష్యమైనా ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటన గుణపాఠం కావాలని, వీఐపీలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.
News December 25, 2024
అఫ్గానిస్థాన్‌పై పాక్ ఎయిర్‌స్ట్రైక్.. 15 మంది మృతి!
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వరుస ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. జెట్స్ ద్వారా బాంబులతో దాడి చేయగా పక్టికా ప్రావిన్స్‌లోని బార్మల్ జిల్లాలో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, దాడులపై పాకిస్థాన్ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్గాన్ బార్డర్లో దాక్కున్న తాలిబన్లను లక్ష్యంగా దాడులు చేసినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.