News July 5, 2024
సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తా: CBN

TG CM రేవంత్ రెడ్డితో భేటీపై AP CM చంద్రబాబు స్పందించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తన విధానమన్నారు. రెండింటికీ సమన్యాయం చేయాలని విభజన వేళ కూడా చెప్పానని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చంద్రబాబు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. CBNకు స్వాగతం పలికేందుకు TDP శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి.
Similar News
News December 28, 2025
సీఎం రేవంత్ కీలక సమీక్ష.. వ్యూహం సిద్ధం!

TG: అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో CM రేవంత్రెడ్డి నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో నదీజలాల పంపకం, TG వాటా, APతో వివాదాలు, BRS హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
News December 28, 2025
ట్రైలర్ ఏది ‘రాజాసాబ్’?

నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తీరా చివరివరకు వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈవెంట్ చివర్లో ట్రైలర్ రేపు వస్తుందని ప్రభాస్ అనౌన్స్ చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 28, 2025
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..

రాత్రి సరిగా నిద్ర రావడం లేదని బాధపడేవారు పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. పాలలో ఉన్న ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాగే కాల్షియం, విటమిన్ D, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పసుపు కలిపి తాగితే మరిన్ని ప్రయోజనాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.


