News October 29, 2024
గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై సీఎంతో చర్చించా: కపిల్ దేవ్
AP: క్రీడలపై CM CBN చాలా ఆసక్తి ఉన్నారని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. తాను ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్నానని, రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై CMతో చర్చించినట్లు చెప్పారు. అందుకు స్థలం ఎక్కడ ఇస్తారనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. AP అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరినట్లు ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని వెల్లడించారు. అమరావతి, విశాఖ, అనంతపురంలో కోర్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
Similar News
News October 30, 2024
అఫ్గాన్‌లో మహిళలు బిగ్గరగా ప్రేయర్ చేసినా నేరమే
అఫ్గానిస్థాన్‌లో మహిళల చదువు, ప్రయాణాలు, బహిరంగంగా మాట్లాడటంపై నిషేధం విధించిన తాలిబన్లు తాజాగా మరో క్రూర నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా వేళల్లో ఒక స్త్రీ గొంతు మరో మహిళకు వినిపించకూడదని, బిగ్గరగా ప్రేయర్ చేయకూడదని మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ ఆంక్షలు విధించారు. వారు పాటలు కూడా పాడకూడదని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలపై మానవ హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News October 30, 2024
మెట్రో రెండో దశలో డ్రైవర్ రహిత కోచ్‌లు
TG: HYD రెండో దశ మెట్రో ప్రాజెక్టులో అత్యాధునిక విధానాలు అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవర్ రహిత ఫోర్త్ జనరేషన్ కోచ్‌లను ప్రతిపాదించింది. ప్లాట్‌ఫామ్‌లపై స్క్రీన్ డోర్లు, స్టేషన్ల వద్ద ఎకరం విస్తీర్ణంలో పార్కింగ్, ప్రతి కారిడార్‌కు ఒక డిపో ఉండేలా నిర్దేశించింది. రెండో దశలో 5 కారిడార్లలో ₹24,269Cr వ్యయంతో 76.4KM మేర <<14462321>>మెట్రో<<>> మార్గానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 30, 2024
ఏపీలో ఓటర్లు 4.14 కోట్లు
AP: రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 4,14,20,395కు చేరింది. ఇందులో పురుషులు 2,03,47,738, మహిళలు 2,10,69,803, థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది. జనవరి నుంచి కొత్తగా 10,82,841 మంది ఓటర్లు చేరారు. నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరించి, వచ్చే జనవరి 6న తుది జాబితాను ఈసీ ప్రచురించనుంది.