News April 24, 2024
T20 World Cup సెలక్షన్ గురించి చర్చ
T20 World cup విషయంలో ఐపీఎల్లో విఫలమవుతున్న వారిని పక్కన పెట్టి, రాణిస్తున్నవారిని తీసుకోవాలన్న చర్చ నడుస్తోంది. విరాట్, రోహిత్, బుమ్రా, సూర్య, గిల్, జైస్వాల్, రాహుల్, రింకూ సెలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీరితో పాటు పరాగ్, తిలక్, అభిషేక్, శశాంక్, దూబే, డీకే, చాహల్, నటరాజన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. IPLలో పంత్, జడ్డూ, పాండ్య, అర్షదీప్, సిరాజ్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.
Similar News
News November 20, 2024
అభివృద్ధిని అడ్డుకునేందుకు కాళ్లలో కట్టెలు పెడుతున్నారు: రేవంత్
TG: పదేళ్లలో KCR చేయలేని పనులను తాము పూర్తి చేస్తున్నామని CM రేవంత్ అన్నారు. KCR ఫామ్హౌస్లో పడుకుంటే KTR, హరీశ్ మన కాళ్ల మధ్య కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. BRS సరిగా పరిపాలన చేసి ఉంటే రైతు రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని ప్రశ్నించారు. రూ.11వేల కోట్ల రుణమాఫీకి KCR పదేళ్లు తీసుకుంటే, తాము 25 రోజుల్లో రూ.18వేల కోట్లు మాఫీ చేశామని వేములవాడ సభలో CM స్పష్టం చేశారు.
News November 20, 2024
జపాన్లో తొలి మూడేళ్లు పిల్లలకు పరీక్షలే ఉండవు!
పిల్లలు పుట్టగానే వారిని ఇంజినీర్ లేదా డాక్టర్ చేయించాలని చాలా మంది అనుకుంటుంటారు. రూ.లక్షలు చెల్లించి స్కూల్లో జాయిన్ చేయించి మార్కులు, గ్రేడ్స్ అంటూ వారిని అప్పటి నుంచే ఇబ్బంది పెడుతుంటారు. కానీ, జపాన్లో అలా కాదు. అక్కడి పిల్లలకు స్కూల్లో మొదటి మూడేళ్లు పరీక్షలు, గ్రేడ్స్ ఉండవు. కేవలం మంచి మర్యాదలు నేర్పిస్తారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఉదారంగా ఉండటం, ప్రకృతి పట్ల దయగా ఉండటం నేర్పిస్తారు.
News November 20, 2024
ఒక్కో బందీకి రూ.42కోట్లిస్తాం: గాజా ప్రజలకు నెతన్యాహు బంపర్ ఆఫర్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా ప్రజలకు టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు. హమాస్ చేతిలో బందీలైన తమ పౌరులను తీసుకొస్తే ఒక్కొక్కరికి రూ.42కోట్ల ($5M) చొప్పున ఇస్తామని ప్రకటించారు. ‘ఘర్షణ వద్దనుకుంటున్న వారికి నేను చెప్పేదొకటే. బందీలను తీసుకురండి. డబ్బులిచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని క్షేమంగా పంపించేస్తాం. ఏ దారి ఎంచుకుంటారో మీ ఇష్టం. మేమైతే బందీలను కచ్చితంగా విడిపిస్తాం’ అని గాజా తీరంలో తెలిపారు.