News August 5, 2025
‘కాళేశ్వరం’పై చర్చ.. ఈ నెలలోనే అసెంబ్లీ సెషన్!

TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా MLAలు, MLCలకు రిపోర్టును వివరించి అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఈనెల మూడో వారంలో ప్రత్యేక సెషన్ నిర్వహించేందుకు క్యాబినెట్లో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలో చర్చించాక మండలాల వారీగా MLAలు మీటింగ్స్ పెట్టి ‘కాళేశ్వరం’ నివేదికపై వివరించనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News August 5, 2025
CBSE టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్

CBSE టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై 15 నుంచి 22 వరకు ఈ పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్/స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ కోసం ఇక్కడ <
News August 5, 2025
ట్రంప్ మాట లెక్క చేయని టిమ్ కుక్!

US అధ్యక్షుడు ట్రంప్ మాటలను యాపిల్ CEO టిమ్ కుక్ లెక్క చేయడంలేదు. భారత్‌లో ఐఫోన్ల తయారీనే వద్దని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ‘అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్ల ఉత్పత్తికి భారతే ప్రధాన హబ్‌గా మారింది. భవిష్యత్తులోనూ అది కొనసాగుతుంది. ఐఫోన్ల అమ్మకాలకూ భారత్ కలిసొచ్చింది. ఇండియాలో రికార్డుస్థాయిలో రెవెన్యూ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 10% వృద్ధి నమోదైంది’ అని టిమ్ కుక్ పేర్కొన్నారు.
News August 5, 2025
ఉత్తరాఖండ్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ప్రధానమంత్రి మోదీ ఫోన్ కాల్ చేశారు. ఉత్తర కాశీలోని తరాలిలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన వారంతా క్షేమంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. మరోవైపు, వరద ముంచెత్తిన తరాలి గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.